తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో షాక్ తగిలింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల ఫోన్ ట్యాపింగ్‌పై ఏపీ ప్రభుత్వానికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వారం రోజుల్లోగా పిటిషన్ కు జవాబు చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఏపీతో పాటుగా కేంద్ర సర్కారుకు సైతం నోటీసులు ఇచ్చింది. సర్వీస్ ప్రొవైడర్లకు హైకోర్టు నోటీసులిచ్చింది.
తమ ఫోన్లను ఏపీ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని, దీనిపై చర్య తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదు ఏపీ ప్రభుత్వానికి పంపామని కేంద్రం తరపు న్యాయవాది పేర్కొన్నారు. తదుపరి కేసు విచారణ ఏప్రిల్ 15 కు వాయిదా వేసింది.