బీజేపీ నేతలు డూప్లికేట్ హిందువులు.. మేం అసలైన హిందువులం అని సీఎం కేసీఆర్ అన్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన రెండో బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.2001లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన సమయంలో..నిజామాబాద్ జిల్లా పరిషత్ పీఠంపై గులాబీ జెండా ఎగిరిందని సీఎం కేసీఆర్ తెలిపారు.తెలంగాణ ఉద్యమం గౌరవాన్ని నిలబెట్టిన జిల్లా నిజామాబాద్ 15 ఏళ్ల పోరాటం తర్వాత రాష్ట్రం సిద్ధించింది. కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకున్నాం. ఇంకా కొన్ని సమస్యలు పరిష్కరించుకోవాలి అని అన్నారు.టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. పెన్షన్లు బాగా పెంచుకున్నాం. రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్నాం అని తెలిపారు.
