Home / 18+ / ఫలితాలు తలక్రిందులవనున్నాయా.? వైఎస్సార్సీపీ 9 సీట్లు గెలుస్తుందా.? బలాబలాలెలా ఉన్నాయి.?

ఫలితాలు తలక్రిందులవనున్నాయా.? వైఎస్సార్సీపీ 9 సీట్లు గెలుస్తుందా.? బలాబలాలెలా ఉన్నాయి.?

ఏపీలో రాజకీయం మండే వేసవిని తలపిస్తోంది.. పార్టీలన్నీ ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగిపోయాయి.. అయితు గోదావరి జిల్లాల్లో హవా చూపించిన పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే నానుడి పట్ల అందరూ ఈ సారి పశ్చిమవైపే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. 2014 ఎన్నికల్లో పశ్చిమలో కనీసం బోణీ కూడా కొట్టని వైసీపీకి ఈసారి ఎన్ని సీట్లు దక్కించుకోనుంది.. జిల్లాలో జనసేన ఖాతా తెరుస్తుందా.. టీడీపీ గత ఎన్నికల్లో జిల్లాను క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది టీడీపీ. మరి ఇప్పుడు టీడీపీ పరిస్థితి ఎలా ఉంది.? పశ్చిమగోదావరి జిల్లాలో పొలిటికల్ వార్ దరువు ప్రత్యేక కధనం.. ఎన్నికల సీజన్ కావడంతో పార్టీలు బలాబలాల ప్రదర్శనకు జిల్లా వేదికగా మారింది.

 

గతేడాది జిల్లాలో జగన్ పాదయాత్రతో హోరెత్తిస్తే టీడీపీ జనసేనలు కూడా తామూ ఉన్నామంటూ గ్రామదర్శిని, కవాతుల పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాయి. వైసీపీ మాత్రం స్థానిక సమస్యల పై క్షేత్ర స్దాయిలో ఉన్న లోపాలపై దృష్టి సారించింది. రంగంలోకి దిగి పార్టీ బలోపేతానికి విశ్వప్రయత్నాలు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో పార్టీల గెలుపోటములు నిర్ణయించేది కాపు, బీసీల ఓటు బ్యాంకులే.. జిల్లాలో మొత్తం ఓటర్లలో 30శాతం కాపు, మరో 30శాతం ఓట్లు బిసి సామాజిక వర్గానివి కాగా మిగతా 40శాతం ఓటర్లు ఓసి, మైనార్టీ , ఎస్సీ, ఎస్టీలుగా ఉన్నారు. 2014ఎన్నికల్లో టీడీపీ పశ్చిమలో క్లీన్ స్వీప్ చేసింది. జిల్లాలోని మొత్తం 15 సీట్లకు 14 గెలవగా మిత్రపక్షమైన బిజెపి ఒక స్థానం సంపాదించుకుంది. పశ్చిమ ప్రజలిచ్చిన ఈ తీర్పు టీడీపీ అధిష్టానానికే షాకిచ్చింది. సహజంగా ఉభయగోదావరి జిల్లాల్లో ఆధిపత్యం ప్రదర్మించిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే సెంటిమెంట్ కూడా ఉంది.

 

2014లో టీడీపీ రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి రాష్ట్ర విభజన ఒక కారణం కాగా, నవ్యాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు లాంటి అనుభవజ్ఞడైన నేత అవసరమనే ప్రచారం.. అట్టహాసంగా కొన్ని పథకాలను, స్కీములు, రుణ మాఫీ, నిరుద్యోగ భృతి, పెన్షన్ పెంపుదలతో పాటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ టిడిపి, బిజెపి కూటమికి ఓటేయాలని పిలుపు నివ్వడం మరో ప్రధాన కారణం. అంతేకాదు కాపు రిజర్వేషన్ కల్పిస్తామంటూ చంద్రబాబు విసిరిన కులం వల ఓటర్లపై బాగా పనిచేసింది. జిల్లాలో టీడీపీకి ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకుకు తోడు ఈ కారణాలన్నీ కలిసి రావడంతో గత ఎన్నికల్లో స్వీప్ చేసింది. అయితే ఈ ఎన్నికల్లో అదే పట్టు నిలబెట్టుకుంటుందా అంటే నో అనే సమాధానం వినిపిస్తోంది. టీడీపీ ఈసారి 4, 5 సీట్లకు పరిమితం అవుతుందన్నది జిల్లా సీనియర్ రాజకీయ విశ్లేషకుల అంచనా.. ఇందుకు కూడా చాలా కారణాలే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో కాపు ఓటు బ్యాంక్ టీడీపీకి బాగా కలిసొచ్చింది.

 

కాపులను బిసిలలో చేరుస్తామంటూ ఇచ్చిన హామీ కాపులందరిని టీడీపీ వైపు తిప్పింది కానీ మళ్లీ ఎన్నికలొస్తున్నా నేటికి కాపు రిజర్వేషన్ల హామీ పూర్తి స్దాయిలో నెరవేరకపోవడంతో ఇది టీడీపీకి పెద్ద దెబ్బ అయ్యే ఆస్కారముంది. కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లను కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమవడం ప్రజలు గమనించారు. గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు జనసేన పార్టీతో బరిలోకి దిగుతున్నారు. దీంతో కాపు ఓట్లు చీలే అవకాశముంది. ఇప్పటివరకూ ఉన్న ఫిక్సిడ్ ఓటు బ్యాంక్ తప్పితే తటస్ధంగా ఉండేవారు టీడీపీకి దూరమయ్యారు.. జన్మభూమి కమిటీల పేరుతో అవినీతి, ప్రభుత్వ శాఖల్లో అవినీతి, సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఇసుక, మట్టితో అక్రమంగా కోట్లాది రూపాయలు సంపాదించడంతో 2014తో పోల్చితే ఇప్పుడు టీడీపీ గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందనే చెప్పాలి.. ఇక గత ఎన్నికల్లో కనీసం బోణీ కూడా కొట్టని వైసీపీ ఈసారి దూకుడు పెంచింది. 2014లో సీట్ల కేటాయింపుతోపాటు, మ్యానిఫెస్టో రూపొందించడంతో జగన్ కు మద్దతిచ్చేవారి సంఖ్య జిల్లావ్యాప్తంగా గణనీయంగా పెరిగింది. ఈ పరిణామాలతో కచ్చితంగా వైసీపీ 9కి పైగా సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తోంది.

 

ఇసుక అక్రమార్జనలో నిష్ణాతుడైన నిడదవోలుయ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, రౌడీయిజంతో రాష్ట్రవ్యాప్తంగా పేరుతెచ్చుకున్న చింతమనేని,
పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి అత్యంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న భీమవరం రూపురేఖలు మార్చలేకపోయిన అంజిబాబు, ఆక్వాపార్కు ఆగ్రహానికి గురవుతున్నారు. అలాగే ఉత్తమ ఎమ్మెల్యేలుగా పేరు తెచ్చుకుని పనులు శూన్యం గా అనిపించుకున్న ఉండి శివ(ఇప్పుడు ఎంపీ), రాధాకృష్ణలు వంటి నేతలు బరిలోకి దిగుతురన్నారు.
ఇదీ వైసీపీ అభ్యర్ధుల జాబితా..
కొవ్వురు(ఎస్సీ)– తానేటి వనిత
నిడదవోలు– జి. శ్రీనివాస నాయుడు
ఆచంట – చెరుకువాడ శ్రీరంగనాథరాజు
పాలకొల్లు– డాక్టర్‌ బాబ్జీ
నరసాపురం– ముదునురి ప్రసాద్‌ రాజు
భీమవరం– గ్రంథి శ్రీనివాస్‌
ఉండి– పీవీఎల్‌ నరసింహరాజు
తణుకు– కారుమూరి వెంకట నాగేశ్వరరావు
తాడేపల్లిగూడెం– కొట్టు సత్యనారాయణ
ఉంగుటూరు– పుప్పాల శ్రీనివాసరావు
దెందులూరు– కొఠారి అబ్బాయి చౌదరి
ఏలూరు– కృష్ణ శ్రీనివాసరావు (నాని)
గోపాలపురం(ఎస్సీ)– తలారి వెంకట్రావు
పోలవరం(ఎస్టీ)– తెల్లం బాలరాజు
చింతలపుడి(ఎస్సీ)– వి.ఆర్‌.ఎలిజా

 

వైసీపీ అభ్యర్ధుల జాబితా పరిశీలిస్తే ఆక్వాపార్కుకు వ్యతిరేకంగా ఉద్యయమం చేసిన గ్రంధి శ్రీనివాస్, జిల్లాలోని టీడీపీ నాయకుల అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన పీవీఎల్ నరసింహరాజు, గిరిజనుల అభ్యున్నతికి పోరాడిన తెల్లం బాలరాజు, చింతమనేని అరాచకాలను ఎదురించిన కొఠారి అబ్బాయి చౌదరి సీనియర్ నేత కారుమూరి, ప్రముఖ వైద్యుడు బాబ్జి వంటి నేతలు రంగంలోకి దిగుతుండగా.. నరసాపురం పార్లమెంట్ నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త కనుమూరి రఘురామకృష్ణం రాజు, ఏలూరు పార్లమెంట్ నుంచి కోటగిరి వారసుడు శ్రీధర్ లు రంగంలోకి దిగుతున్నారు.ఇది ఇలా ఉండగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ భీమవరం నుండి పోటీ చేస్తున్నారు.అయితే అతని రాకతో ఇక్కడ ఏమాత్రం ప్రభావం ఉండదని అన్న చిరంజీవికి పట్టిన పరిస్థితే ఆయనకు పడుతుందని భావిస్తున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat