ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే అయన ఇవాళ తాడేపల్లిలో పర్యటిస్తుండగా… స్థానికుల నుంచి నిరసన వ్యక్తమైంది. సీతానగరంలో ప్రచారం నిర్వహిస్తుండగా లోకేష్ పై స్థానికులు సమస్యలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘మీరేమో పెద్ద పెద్ద భవంతులు కట్టుకుంటారా? పేదలకు ఇళ్లు ఎక్కడ కట్టించారు? అసలు ఒక్క ఇల్లు అయినా కట్టారా? ఏం సమస్యలు పరిష్కరించారని మీకు ఓటు వేయాలి? అని నిలదీశారు. వారికి సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన లోకేష్ .. కాసేపు మాట్లాడిందే మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
