దేశంలోని ముఖ్యమంత్రుల పని తీరు పై ఇవాళ ర్యాంకులు విడుదల అయ్యాయి. ఈ పోల్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి స్థానం దక్కించుకున్నారు. సీవోటర్-ఐఏఎన్ఎస్ సంస్థ నేషన్ ట్రాకర్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇందులో ఓటర్ల నుంచి అధికశాతం అఫ్రూవల్ రేటింగ్స్ అందుకున్న సీఎంగా కేసీఆర్ నిలిచారు .కేసీఆర్ తో పాటు హిమాచల్ ప్రదేశ్, ఒడిషా, ఢిల్లీ రాష్ట్రాల సీఎంలు కూడా టాప్ ప్లేస్ లో నిలిచారు. ఈ రాష్ట్రాల సీఎంల పనితీరుపై ఓటర్లు అత్యంత సంతోషంగా ఉన్నట్లు తేలింది. ఈ సర్వే ప్రకారం..దేశంలోని అందరి సీఎంల కన్నా తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనపై అధికశాతం ప్రజలు సంతోషంగా ఉన్నట్లు తేలింది.
తెలంగాణలో 2వేల 827మంది తమ అభిప్రాయాలను చెప్పగా అందులో 68.3శాతం మంది కేసీఆర్ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ నాయకుడు చేపట్టలేదని తెలిపారు. 20.8శాతం మంది కేసీఆర్ పాలన పర్వాలేదని చెప్పారు. 9.9శాతం మంది కేసీఆర్ పాలనపై పూర్తిగా అసంతృప్తితో ఉన్నట్లు తమ అభిప్రాయం వెల్లడించారు. మొత్తంగా 79.2శాతం నెట్ అఫ్రూవల్ రేట్ తో దేశంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన సీఎంగా కేసీఆర్ నిలిచారు.
కేసీఆర్ తర్వాత స్థానంలో 68.4శాతంతో హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాకూర్ నిలిచారు. 64.9శాతంతో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ నిలవగా, 61.5శాతం నెట్ అఫ్రూవల్ రేట్ తో ప్రజాదరణ ఉన్న సీఎంల జాబితాలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నాలుగో స్థానంలో నిలిచారు. ఈ సర్వే ప్రకారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడు 14వ స్థానానికి పరిమితం అయ్యారు. ఏపీలో 19వేల 900మంది అభిప్రాయాలు తెలుసుకోగా.. చంద్రబాబు పనితీరుపై కేవలం 41.7శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉన్నారు. 28.2శాతం మంది ప్రజలు పర్వాలేదని చెప్పారు. 28.6శాతం మంది బాబు పాలనపై సంపూర్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ సర్వే బీజేపీకి నిరాశ కలిగించేలా ఉంది. కేవలం రెండు రాష్ట్రాల బీజేపీ సీఎంలు మాత్రమే టాప్ 10లో చోటు దక్కించుకున్నారు.
#IANScvoter: #Telangana's #KChandrashekharRao is the top performer among the Chief Ministers in the country followed by his counterparts in #HimachalPradesh, #Odisha and #Delhi.#LokSabhaElections2019 #Dangal2019 pic.twitter.com/nrfiP4WMg1
— IANS Tweets (@ians_india) March 22, 2019