ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పతనం ఖయమైందని సినీ నటుడు , శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మంచు మోహన్ బాబు అన్నారు.తిరుపతిలో అయన విద్యార‍్థులతో కలిసి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను చెల్లించాలని ధర్నాకు దిగారు.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుపై పలు విమర్శలు చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీ పథకాలు ప్రవేశపెట్టారు. అలాగే ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. మంచి చేసే ముఖ్యమంత్రులను ఎవరైనా అభిమానిస్తారు. కానీ నువ్వు మాత్రం అలా కాదు. ఆ ముఖ్యమంత్రులు ఆ పథకాలు ప్రారంభిస్తే నేను ఎందుకు ఇవ్వాలని చెప్పు అప్రిషియేట్ చేస్తా. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు నమ్మి ఓటు వేస్తే నీచంగా మోసం చేశావు. మహానుభావుడు ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో ఆయనకే సభ్యత్వం లేకుండా చేశారు. అసలు టీడీపీ నీది కాదు. నీవు అన్నగారి వద్ద నుంచి బలవంతంగా లాక్కున్నావు. ఆయనపై ఉన్న అభిమానంతోనే నేతలు ఆ పార్టీలో ఉన్నారు అని అన్నారు.
