ఎలక్ట్రానిక్స్ తయారుచేసే ప్రముఖ కంపెనీ ఎల్జీ సంస్థ తమ నుండి సరికొత్త స్మార్ట్ఫోన్ వీ50 థిన్క్యూ పేరిట ఈ నెల 19వ తేదీన కొరియా మార్కెట్లో విడుదల చేయనున్నట్లు తెల్పింది. అయితే ఈ ఫోన్ రూ.73,105 ధరకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.
6.4 ఇంచ్ డిస్ప్లే, 3120 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 2 టీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 16, 12
మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 8, 5 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, 5జీ, 4జీ వీవోఎల్టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్ఈ, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సి,
4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగిఉంటుంది.