ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరుసగా సమీక్షలు నిర్వహించడాన్ని ఎన్నికల సంఘం తప్పుబట్టింది. సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించకూడదని ఎన్నికల నియమావళిలో ఉన్నా సమీక్షలు జరపడాన్ని కోడ్ ఉల్లంఘనగా ఈసీ వర్గాలు భావిస్తున్నాయి.ఈ క్రమంలోనే తాజాగా కోడ్ నియమాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది మరోసారి విడుదల చేశారు. దీంతో హోంశాఖపై సమీక్షను సీఎం చంద్రబాబు రద్దు చేసుకున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమీక్ష బదులు తాజా పరిస్థితిని హోంశాఖ సెక్రటరీ అనురాధ సీఎంకు బ్రీఫ్ చేశారు.
