నారాయణరావు పేట మండలాన్ని కోనసీమగా మారుస్తాం.. రైతుల జీవితాల్లో వెలుగు నింపుతాం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా నారాయణరావు పేట మండల కేంద్రంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ..
” నారాయణ రావు పేట మండలం కళ30 ఏండ్ల కల, పోరాటం చేసి కల సహకారం చేసుకొని ఎన్నికలు జరుపుతున్నాం. జూన్ మొదట వారంలో ఈ మండలం లో ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభిస్తాం,అతి త్వరలో నూతన భవనాలు నిర్మిస్తాం. ఈ మండలానికి జాతీయస్థాయిలో అవార్డ్ వచ్చేలా కృషి చేసి,ఆదర్శ మండలంగా తయారుచేస్తా. కబురు లేని గ్రామాన్ని డిల్లీ కి తీసుకెళ్లినా ఇబ్రహీం పూర్ గ్రామం మాదిరి నారాయణరావు పేట ని తీసుకెళ్లుతా. విద్యార్థులకు గ్రూప్2, కానిస్టేబుల్ కోచింగ్ ఉచితంగా ఇప్పించా.. ఏడాదిలో హైదరాబాద్ నుండి సిద్దిపేట కు రైలు వస్తుంది. ఈ మండలానికి 5వేల ఎకరాలకు సాగునీరు ఇస్తాం. దసరా నాటికి ఈ మండలానికి గోదావరి నీళ్లతో సస్యశ్యామలం చేస్తాం..మత్తడి దుంకుతుంటే బతుకమ్మ లు వేసే రోజులు,చెద బావుల్లో చెంబులతో నీళ్లు ముంచుకొనే రోజులు దగ్గర లొనే ఉన్నాయి. గోదావరి నీళ్లొస్తే2పంటలు పండుతాయి, చెరువులు, కుంటలు ఎండవు,కాలం అయిన కాకపోయినా మత్తడి దుంకుతాయి. మీ దయతో ఎమ్మెల్యేలు గా గెలిచిన 5ఏండ్లు సేవా చేయడమే నా బాధ్యత. ప్రభుత్వ పథకాలు నేరుగా మీకు రావాలంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించండి “అని హరీశ్ రావు అన్నారు.