ఈరోజు ఉదయం ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ పై కామేపల్లి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడి పై ఆమె స్పందించారు. ఈరోజు జరిగిన దాడి గిరిజన మహిళల మీద జరిగిన దాడి అని అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలపై దాడిని ఖండిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని వీడి రాష్ట్ర అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పార్టీలో చేరారని అయితే ఎక్కడ కూడా ఇలాంటి దాడులు జరగలేదని అన్నారు. కామేపల్లి మండలంలో గడీల రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు.