టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కేరళ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సాయంత్రం అనంత పద్మనాభ స్వామిని కుటుంబ సమేతంగా కేసీఆర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి.. ఆశీర్వదించారు. కాగా మరికాసేపట్లో త్రివేండ్రంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అంతకుముందు తిరువనంతపురం ఎయిర్పోర్టులో ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలుగు సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
