టీవీ9 రవి ప్రకాష్ పై ఫోర్జరీ కేసు నమోదయిన సంగతి తెలిసిందే తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో మీడియా సంస్థ కార్యదర్శి కౌశిక్ రావు టీవీ9 సీఈఓ ప్రకాష్ చీటింగ్ కేసు పెట్టారు ఈ క్రమంలోనే పోలీసులు రవిప్రకాష్ పాస్ పోర్ట్ ను స్వాధీనం చేసుకున్నారు గత నాలుగు రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్న రవి ప్రకాష్ కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఇప్పటికే పరారీలో ఉండడంతో పరోక్షంగా నేరానికి పాల్పడినట్టేనని అర్ధమవుతోంది. ఈ నేపధ్యంలో రవిప్రకాష్ కు న్యాయస్థానంలో కేసు హియరింగ్ కు వస్తే దాదాపుగా 4నుంచి 6 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.