తెలంగాణ కాంగ్రెస్ ప్రదేశ్ అధ్యక్షుడు,నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్ .ఉత్తమ్ కుమార్ రెడ్డి సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు.. ఆయన మీడియాతో మాట్లాడుతూ “ఓటర్ల జాబితా లేకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆయన ప్రశ్నించారు.ఆయన ఇంకా మాట్లాడుతూ ఓటర్ల జాబిత రెడీ అయ్యేవరకు ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయాలని సరికొత్త డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు.అయితే ఇప్పటికే ఏపీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి వీవీప్యాట్లను యాబై శాతంకుపైగా లెక్కించాలని డిమాండ్ చేసిన సంగతి కూడా తెల్సిందే..అయితే ఈ డిమాండ్ ను సీఈసీ తోసిపుచ్చిన సంగతి విధితమే.
