రకుల్ ప్రీత్ సింగ్ తన అందంతో నటనతో అందరిని ఆకట్టుకుంటున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ అందాల భామ ప్రస్తుతం హిందీలో అజయ్ దేవ్ గన్ హీరోగా నటించిన ‘దే దే ప్యార్ దే’ అనే సినిమాలో నటిస్తుంది.ఇందులో ఒక సీన్ లో రకుల్ మందు బాటిల్ పట్టుకొని డాన్స్ చేస్తూ అందాలు ఆరబోస్తుంది.అయితే అది చూడడానికి అసభ్యకరంగా ఉందని సెన్సార్ బోర్డ్ చెప్పిందట.ఈ సీన్లు తీసేయమని బోర్డ్ సభ్యులు చెప్పడం జరిగింది. ఈ చిత్ర నిర్మాతలు ఎంత ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది.చివరకు ఆ బాటిల్ కు మరియు స్కిన్ కు బ్లర్ చేయమనడంతో దానికి ఒప్పుకున్నారు.రకుల్ ఇందులో సెకండ్ హీరోయిన్..అజయ్ మొదట టబు ని పెళ్లి చేసుకుంటాడు.ఆ తరువాత మరో భామ అంటే మన రకుల్ ని తగులుకుంటాడు.ఈ చిత్రం లో రకుల్ మద్యం అమ్మే అమ్మాయిగా నటిస్తుంది.సెన్సార్ సభ్యులు ఎంత ఆపిన సినిమాలో మాత్రం కొన్ని సన్నివేశాలు అందరిని ఆకట్టుకుంటాయని తెలుస్తుంది.ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.