ఏపీలో ఎప్రిల్ 11 న జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలవనుందనే సంకేతాలు వెలువడ్డాయి. దీంతో గెలిచిన తర్వాత కార్యాచరణను ఆపార్టీ సిద్ధం చేసింది. ఇప్పటికే అన్ని సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ జగన్ ప్రభజనం అని తెలిపాయి. రేపు పూర్తి ఫలితాలు రాగానే జగన్ సునామీ తెలుస్తుంది..అయితే ఈ నెల 30వతేది వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముహూర్తం బాగుండటంతో జగన్ ఆ రోజు ప్రమాణస్వీకారం చేయడానికి నిర్ణయించుకున్నాడనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా జగన్ ప్రమాణస్వీకారోత్సవనికి వైసీపీ నేతలు దేశ వ్యాప్తంగా ఉన్న సీనీయర్ నేతలను ఆహ్వానించారట. వైఎస్ జగన్ తండ్రి దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితులు, స్నేహపూర్వకంగా ఉండే నాయకులతో పాటు దాదాపుగా 25 రాష్ట్రాలనుంచి జగన్ శ్రేయోభిలాషులు, వివిధ పార్టీల అధ్యక్షులు నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారట.. వీరిలో ప్రస్తుతానికి ఈ పేర్లు వినిపిస్తున్నాయి. మిగిలిన నాయకుల జాబితా మరో రెండ్రోజుల్లో తెలియనుంది.
1 తెలంగాణ ముఖ్యమంత్రి ..కేసీఆర్
2 అఖిలేష్ యాదవ్
3 ఉండవల్లి అరుణ్ కుమార్
4 అరవింద్ కేజ్రీవాల్
5 మమతా బెనర్జీ
6 ఏకే ఆంటోనీ
7 శరద్ పవార్
8 డీఎంకే అధినేత, తమిళనాడు మాస్ లీడర్ స్టాలిన్
9 గాలి జనార్ధన్ రెడ్డి
10 సీపీఐ అగ్రనేత సీతారాం ఏచూరి
11 ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ
12 బీసీ సంఘం జాతీయ నాయకుడు ఆర్ కృష్ణయ్య తదితరులు రానున్నారు.