ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలు తనపై మరింత బాధ్యత ఉంచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. కౌంటింగ్ అనంతరం గురువారం సాయంత్రం ఆయన తాడేపల్లి మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ…రాష్ట్ర చరిత్రలో ఇటువంటి విజయం ఎప్పుడు నమోదు కాలేదని,ఇది గొప్ప విజయమని అన్నారు.మీ అందరి దీవెనలతో, దేవుని దయతో విజయం సాధ్యమయిందన్నారు.ఈరోజు మీ ముందు మాట్లాడటం నా అదృష్టం అని అన్నారు.ఆరు నెలల నుంచి ఏడాది లోపు జగన్ ఒక మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటాను అన్నారు.పాదయాత్ర లో ప్రజల కష్టాలను నేను చూశా….నేను విన్నా ..నేను ఉన్నా అన్నారు.ఈ నెల 30న విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని తెలిపారు.
