ఎన్నికల్లో వైయస్‌ఆర్‌సీపీ ఘనవిజయం సాధించడం పట్ల వరుణుడు కూడా హర్షం వ్యక్తం చేసినట్టు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అసలే మండే ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా వైయస్‌ఆర్‌సీపీ గెలవడంతో అనంతపురం, కర్నూలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి ఆగకుండా వర్షం కురిసాయి.. దీనిని చాలా శుభ సూచకంగా ఫీలవుతున్నారు. ఇన్ని రోజులు ఎండలతో అల్లాడిన రాయలసీమ ప్రజలు వర్షం కురవడంతో ఉపశమనం పొందుతున్నారు. దీనిపై వైయస్‌ఆర్‌సీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నాయి. రాజన్న రాజ్యం వచ్చిందని, అందుకే వర్షాలు పడుతున్నాయని జగన్ సీఎం అయ్యారు ఇక వర్షాలు సమృద్ధిగా కురుస్తాయంటున్నారు. బోర్లు నిండాయని, తమ ఊరిలో పంటకు కావాల్సిన వర్షం కురిసిందని మొలకు వేస్తామంటూ పోస్టులు పెడుతున్నారు.
