2019 ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.మొన్నటివరకు ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఇప్పుడు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం లో మధ్యాన్నం సమయంలో ఈ వేడుక జరగనుంది.జగన్ పదేళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి.అయితే జగన్ ఈ స్థాయిలో ఇంత మెజారిటీతో గెలవడానికి జగన్ పాత్ర ఎంత ఉందో.అంతే ముఖ్యమైన పాత్ర మరొకరిది కూడా ఉంది.అతను మరెవ్వరో కాదు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కి నీడలా ఉండే రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి.తనపై అధికార పార్టీ ఎన్ని అబాండాలు మోపిన భరించి.సొంత పార్టీ నేతలను బుజ్జగించి.జగన్ ని ఒప్పించి ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని విషయాల్లో జగన్ వెనక ఉండి నడిపించారు.వైసీపీ విజయంలో విజయసాయి రెడ్డిది కీలక పాత్ర అని చెప్పాలి.
ఇంకా చెప్పాలి అంటే పార్టీలో జగన్ తర్వాత కేడర్ ఎవరిదీ అంటే ఈయన పేరే చెబుతారు.ప్రతీ విషయం లో జగన్ వెనుక ఉంటూ అటు సోషల్ మీడియా ఇటు పార్టీ కార్యకలాపాలకి సంబంధించి అన్నీ కూడా ఆయనే దగ్గరుండి చూసుకున్నారు.సెంట్రల్ లో బీజీపీ వైసీపీ పట్ల మొగ్గు చూపడంలో ఈయన కీలక పాత్ర పోషించారు.ఢిల్లీ స్థాయిలో తన పరిచయాలను ఉపయోగించుకొని అందరి చూపు వైసీపీ వైపే ఉండేలా చేసింది విజయసాయి రెడ్డి అనే చెప్పాలి.జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలో పార్టీకి సంభందించి ఎలాంటి విషయమైన ఇతడే చూసుకొంటూ పార్టీని ముందుకు తీసుకెళ్ళారు.ఇంకా చెప్పాలంటే జగన్ టీడీపీని దెబ్బ కొట్టడానికి సరైన గురి చూపించాడు.ఆయన వ్యూహాలతో టీడీపీని మట్టికరిపించి వైసీపీని అధికారంలోకి తీసుకొచ్చాడు.