ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఈమేరకు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇంకా తదితర ముఖ్య నేతలు జగన్ ను అభినందించారు.ఈ మేరకు వారందరికీ జగన్ ధన్యవాదాలు తెలియజేసారు.ఇక జగన్ రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన మోదీకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు.అలాగే తనకి శుభాకాంక్షలు చెప్పిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,రాహుల్ గాంధీ,ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కు ధన్యవాదాలు చెప్పారు.తన ప్రమాణస్వీకారానికి హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్,డీఎంకే అధినేత స్టాలిన్,తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర నేతలు అందరికి ధన్యవాదాలు తెలిపారు.
