ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా ఉపాధ్యక్షుడు రాజేష్ గిరి రాపోలు మరియు న్యూ సౌత్ వేల్స్ కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి పిన్నమ ఆధ్వర్యంలో నిర్వహించారు .ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలను ఆస్ట్రేలియాలోని అని ప్రధాన నగరాలలో తెరాస ఆస్ట్రేలియా అద్వర్యం లోనిర్వహించారు. రాజేష్ రాపోలు, ప్రవీణ్ పిన్నమ మాట్లాడుతూ ఉద్యమ నేపధ్యాన్నీ , స్వరాష్ట్రం సిద్దించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న వివిధ పథకాలను మరియు భవిష్యత్ ప్రణాళికల పట్ల పభుత్వానికున్న స్పష్టతను విపులంగా వివరించారు.
ఉప్పల్ నియోజకవర్గంలో ఘనంగా తెలంగాణ రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకలు
బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎన్ ఆర్ ఐ ల ప్రాముఖ్యతను గుర్తు చేశారు. మెల్బోర్న్ లో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ తమ టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అద్వర్యంలో తాము చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి వివరించారు, బంగారు తెలంగాణ సాధనలో తమవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా వుంటాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆస్ట్రేలియా ప్రభుత్వానికి మరియు ఆస్ట్రేలియా లోని ఎన్ ఆర్ ఐలకు తాము సమన్వయకర్తలుగా తమ తోడ్పాటును ఎలా అందించగలమో వివరించారు.
రైతు బంధుతో రైతుల జీవితాలు మారాయి..కేటీఆర్
సిడ్నీ లో ఈ వేడుకలో ముఖ్య నాయకులూ విక్రమ్ కటికనేని, సాగర్ రెడ్డి, మాధవ్ కటికనేని ,జస్వంత్ కొడరపు ,సంగీత , రవి ధూపాటి, పరశురామ్ మోతుకుల,లక్ష్మి నారాయణాచార్యులు , రవి సూరిశెట్టి ,వరుణ్ నల్లెల్ల , ,ప్రకాష్ హనుమంత్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.