జూన్ 2వ తేదీన జరిగే రాష్ట్ర అవతరణ వేడుకలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్‌లో సుమారు ఐదువేల మంది కూర్చునేవిధంగా ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమం సందర్భంగా మొదట అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. 9 గంటలకు పతాకావిష్కరణ, పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. 10.30లకు సీఎస్ ఆధ్వర్యంలో ‘ఎట్ హోం’ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
కాగా.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం 8 గంటలకు తెలంగాణ భవన్ లో జరిగే కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారు.