జగన్‌మోహన్‌రెడ్డి తొలి మంత్రివర్గంలో పదవీ స్వీకార ప్రమాణం చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరుజిల్లా పుంగనూరు నియోజకవర్గం నుంచి గెలిచారు. తాజా ఎన్నికల్లో టీడీపీ అభ్యర్తి ఎన్.అనూషారెడ్డి పై 43,555 ఓట్ల భారీ మెజార్టీతో ఈయన గెలుపొందారు. 2009 లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి క్యాబినెట్‌లో తొలిసారి ఆయన మంత్రిపదవి చేపట్టారు. రాష్ట్ర అటవీ శాఖా మంత్రిగా బాధ్యతలునిర్వహించారు. రాష్ట్ర, జిల్లాస్థాయిలో విశేష సేవలందించారు. అటవీ శాఖతో పాటు జిల్లాలో పలుఅభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటివరకు 6సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి దివంగతులయ్యాక మంత్రిపదవికి రాజీనామా చేసి విధేయత చాటుకున్నారు.
వైఎస్ కుటుంబంతో ఉన్న అనుబంధంతో జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో సర్వం తానై పార్టీ పటిష్టతకు ఎనలేని కృషిచేశారు. 2014ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పట్టు సడలనీయకుండా చాక చక్యంగా రాజకీయాలు చేసారు. జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో ఎట్టకేలకు చోటు దక్కించుకున్నారు. తండ్రి, తనయుడి మంత్రివర్గంలో పనిచేసిన అరుదైన రికార్డును పెద్దిరెడ్డి సొంతం చేసుకున్నారు.ఈయనకు పంచాయతీ రాజ్, మైనింగ్ శాఖలు ఇచ్చారు.