చింతమనేని ప్రభాకర్.. పశ్చిమగోదావరి జిల్లాలో ఇతని పేరు తెలియని వ్యక్తి ఉండరు. ముఖ్యంగా చింతమనేని ఆగడాలు, అరాచకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. గతంలో ఎమ్మెల్యే చింతమనేని మాజీమంత్రి వట్టి వసంత్ కుమార్ పై చేయి చేసుకున్నారు. ఈ కేసులో న్యాయస్థానం ఆయనకు ఆర్నెల్ల జైలుశిక్ష కూడా విధించింది. 2011లో అప్పటి మంత్రి వసంత్‌కుమార్‌పై చింతమనేని చేయి చేసుకున్నారు. అదే సమయంలో ఎంపీ కావూరి సాంబశివరావు పైనా దౌర్జన్యం చేశారు.. వసంత్ కుమార్ ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంపై విచారణ జరుపుతూ వచ్చిన భోమడోలు మెజిస్ట్రేట్ చింతమనేని దోషిగా ప్రకటించి ఆరునెలల జైలు శిక్ష విధించింది. ఇది రాష్ట్రంలో సంచలనమైన కేసు కాగా.. ఎమ్మార్వో వనజాక్షిపై దెందులూరు శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న చింతమనేని కృష్ణాజిల్లా నూజివీడు తహశీల్దారు వనజాక్షిపై తమ్మిలేరు అక్రమ ఇసుక రవాణా విషమై జరిగిన గొడవ రాష్ట్రమంతా వ్యాపించింది..
ఏకంగా అసెంబ్లీలోనే చర్చజరిగింది. చింతమనేని దౌర్జన్యంపై జాతీయమీడియా వార్త కూడా అయింది. జగన్ తెలుగుదేశాన్ని ఉతికి ఆరేసారు. చింతమనేని వనజాక్షి మీద ఇసుకలో పడేసి కొట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా రచ్చ జరిగింది. ఇవే కాకుండా ట్రాఫిక్ పోలీస్ పై చేయిచేసుకోవడం, తనకు వ్యతిరేకంగా వార్తలు రాసిన జర్నలిస్టులపై దాడులు, అనేక దౌర్జన్యాలు, దాడుల్లో చింతమనేనికి ట్రాక్ రికార్డులున్నాయి. అయితే అధికార అండతో ఆయనపై చర్యలు తీసుకున్నవారు లేదు.. ఇప్పుడు ప్రభుత్వం మారింది. చాలా సిన్సియర్ అధికారులను నియమించారు. కచ్చితంగా చింతమనేని పాపం పండుతుందని, ఆయన జైలుకు వెళ్లడం తప్పదనే సంకేతాలు వ్యక్తమవుతున్నాయి.