ఏపీ ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు షాక్. నరసరావుపేట లోక్ సభ నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు భద్రతగా ఉన్న గన్ మెన్లను తొలగించింది రాష్ట్ర ప్రభుత్వం.. అయితే పోలీస్ శాఖ ఉన్నతాధికారుల నివేదక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అయితే మాజీ మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలకు వ్యక్తిగత భద్రత కోసం అక్కడ నెలకొన్న పరిస్థితులను బట్టి పోలీస్ శాఖ గన్ మెన్లను కేటాయిస్తుందని మనకు విదితమే. అయితే ప్రస్తుతం రాయపాటి సాంబశివరావుకు ఎటువంటి అపాయం లేదని తేలడంతో వైసీపీ సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.అయితే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది.
