తెలంగాణలో అటవీ శాఖ అధికారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, ధైర్యంగా ఉండాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భరోసానిచ్చారు. సోమవారం సచివాలయంలో అటవీశాఖ ఉద్యోగుల సంఘం జేఏసీ ప్రతినిదులు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చారు. అటవీ ఉద్యోగులపై జరిగిన దాడుల్లో నిందితులను సత్వరం శిక్షించడానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటుచేయాలని, నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్బంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ…కొత్త సర్సాల ఘటన దురదృష్టకరమని, విధి నిర్వహణలో ఉన్న అటవీ శాఖ ఉద్యోగులు, ఓ మహిళ ఉద్యోగిని పై దాడి చేయడం గర్హనీయం అన్నారు. సార్సాల దాడి ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని, దాడికి పాల్పడినవారిని అరెస్టు కూడా చేయడం జరిగిందన్నారు. అటవీ శాఖ అధికారు ఆత్మ స్థైరాన్ని కొల్పోకుండా ముందుకు సాగాలని సూచించారు. పోలీసు శాఖ సహాయంతో రక్షణ కల్పిస్తామని భరోసానిచ్చారు.
పోలీసులు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని పని చేయాలన్నారు. అడవులు మనందరివని, అడవులు ఉంటేనే మన మనుగడ సాధ్యమని, అడవుల పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన వారిలో SFS అసోసియేషన్ కార్యదర్శి డి. వెంకటేశ్వర్ రెడ్డి, FROs అసోసియేషన్ కార్యదర్శి బి.మోహన్, TJFOA స్టేట్ ప్రెసిడెంట్ నాగేంద్రబాబు, TJFOA వైస్ ప్రెసిడెంట్ మౌజం అలీ ఖాన్, అటవీ శాఖ TNGOs ఫోరమ్ ప్రెసిడెంట్ ఆదినారాయణ రెడ్డి ఉన్నారు.
Post Views: 294