రానున్న మూడు నెలల్లో వర్ధన్నపేటను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వర్ధన్నపేట నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు,ఎమ్మెల్యే ఆరూరి రమేష్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ సహకారంతో వర్ధన్నపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. ఆడిటోరియం, స్మశానవాటిక, సీసీ రోడ్లు, మోడల్ మార్కెట్, మటన్, చికెన్ షాపులకు ప్రత్యేక భవనాలను నిర్మిస్తామన్నారు.
