తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పలు బిల్లులను ఈ రోజు గురువారం ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో పురపాలక చట్టం – 2019 బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ రోజు సాయంత్రం వరకు 4 గంటల వరకు ప్రభుత్వం బిల్లుపై సవరణలు స్వీకరించనుంది. ఈ బిల్లుపై రేపు శాసనసభలో చర్చించి, ఆమోదం తెలుపనున్నారు. చర్చకు ప్రభుత్వం తరపున సీఎం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్(సవరణ)బిల్లు, బోధనాస్పత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయోపరిమితి పెంపు బిల్లును సీఎం కేసీఆర్ సభలో ప్రవేశపెట్టారు. తెలంగాణ పంచాయతీరాజ్(సవరణ) బిల్లు, తెలంగాణ రుణవిమోచన కమిషన్ బిల్లును మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రవేశపెట్టారు
