రాజ్యసభ సభ్యులు, టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలు హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించారు. సామాన్య ప్రజలతో కలిసి ఆయన మెట్రో ట్రైన్ లో ప్రయాణించారు. రైలులో ప్రయాణికులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. అంతకుమందు వనస్ధలిపురంలో మాంగళ్య షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. ఆ తరువాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ ఫలహారం బండి ఊరేగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
