టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పుట్టిన రోజు వేడుకలు టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం లో నిరాడంబరంగా జరిగాయి .వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ,పరకాల ఎమ్మెల్యే సి .ధర్మా రెడ్డి ,ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ ,చిరుమళ్ల రాకేష్ కుమార్ ,గ్యాదరి బాలమల్లు ,టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయ కార్యదర్శి రమేష్ రెడ్డి ల సమక్షం లో కేక్ కట్టింగ్ జరిగింది .ఈ సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపునకు స్పందించి ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ఆపదలో ఉన్న ముగ్గురికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేశారు .తన నియోజకవర్గానికి చెందిన వి .నవ్య అనే పేద విద్యార్థిని (ఇంజినీరింగ్ )ఉన్నత చదువుల కోసం)లక్ష రూపాయలు ,తెలంగాణ ఉద్యమం సందర్భంగా గాయపడ్డ శివ ,రాజు లకు చెరో లక్ష రూపాయలను వినయ్ భాస్కర్ అందజేశారు. కేటీఆర్ ఇచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ పిలుపును పలువురు అభినందించారు .వినయ్ భాస్కర్ ఉదారత ను వక్తలు కొనియాడారు .ఆడంబరంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోకుండా సేవాకార్యక్రమాలు నిర్వహించాలంటూ కేటీఆర్ ఇచ్చిన పిలుపును స్వాగతించారు
