తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేటీఆర్ బర్త్ డే సందర్భంగా తీసుకొచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమానికి విశేష స్పందన వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు,కార్యకర్తలు తమకు తోచిన విధంగా ఇతరులకు సాయం చేస్తూ కేటీఆర్ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
మరికొంతమంది మొక్కలు నాటుతూ రామన్నకు విషెస్ చెబుతుండగా నేను సైతం అంటూ ముందుకొచ్చారు కేటీఆర్ తనయుడు హిమాన్షు.తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు హిమాన్షు. స్వయంగా పేదలకు తానే వడ్డిస్తూ వారి ఆకలి తీర్చారు.
ఈ సందర్భంగా పలువురు హిమాన్షు సేవా దృకృథాన్ని కొనియాడారు.అంతకుముందు జూబ్లీహిల్స్ శ్రీ పెద్దమ్మ తల్లి దేవస్థానంలో కేటీఆర్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రైమత్ నగర్ లోని కుమార్ స్కూల్ లో పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు.
Post Views: 274