తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా మేడిగడ్డకు చేరుకున్నారు.ఈ క్రమంలో ముఖ్యమంత్రి వెంట వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్,రాజ్యసభ జోగినపల్లి ఎంపీ సంతోష్‌కుమార్, సీఎంవో, ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. ముఖ్యమంత్రికి మేడిగడ్డ వద్ద మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే గండ్రవెంకటరమణారెడ్డి, జెడ్పీ చైర్మన్లు పుట్టమధు, శ్రీహర్షిణి, గండ్ర జ్యోతి, కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ భాస్కరన్ ఘనంగా స్వాగతం పలికారు. ఎరియల్ వ్యూ ద్వారా, మేడిగడ్డ వద్ద గోదావరి ప్రవాహాన్ని సీఎం పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి వాయినం సమర్పించారు.
