సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ తెరాస సభ్యత్వ నమోదు సభ మంగళవారం సితఫల్ మండి లో కోలాహలంగా జరిగింది. ఉపసభాపతి పద్మారావు గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా మంత్రులు మహమూద్ అలీ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు పాల్గొన్నారు. హోం మంత్రి మహమూద్ అలీ గారు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్ర సాధన ఉద్యమంలో పద్మారావు గౌడ్ గారి పాత్ర కీలకమైనదని అన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి కెసిఆర్ గారు చేపడుతున్న అభివృధి, సంక్షేమ కార్యక్రమాలు జాతీయ స్థాయిలో సైతం ప్రత్యేక గుర్తింపును పొందాయని ప్రశంసించారు. నిరుపేదల సంక్షేమానికి పద్మారావు గౌడ్ గారు నిరంతరం శ్రమిస్తూ ప్రజల మనిషిగా తన ప్రత్యేకతను చాటుకున్నారని తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో సికింద్రాబాద్ ప్రధమ స్థానంలో నిలుస్తుందని అయన ప్రశంసించారు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ ప్రజా రంజకమైన్ పాలనను అందిస్తున్న ఘనత తెరాస ప్రభుత్వానికే దక్కిందన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచేలా తెలంగాణాలో సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెరాస సభ్యత్వానికి మంచి స్పందన లబిస్తోందని తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గం అభివృధి, సంక్షేమ కార్యకలాపాలకు చిరునామాగా మారుతోందని తలసాని గారు వివరించారు. పద్మారావు గౌడ్ గారి ప్రత్యేక చొరవ కారణంగా తెలంగాణా రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎక్కువ పేద రోగులను ఆడుకున్న ఘనత సికింద్రాబాద్ నియోజకవర్గానికి దక్కిందని ప్రశంసించారు.
జంటనగరాల్లోనే మోడల్ గా నిలిచేలా multipurpose ఫంక్షన్ హాల్ ను నిర్మించిన్ పద్మారావు గౌడ్ గారిని అయన ప్రత్యేకంగా అభినందించారు. సభ్యత్వ నమోదులో సికింద్రాబాద్ ప్రధమ స్థానంలో నిలవాలని, కార్యకర్తలు చురుకుగా పని చేయాలని కోరారు. ఉప సభాపతి పద్మారావు గౌడ్ గారు మాట్లతుడు ప్రజా సంక్షేమమే లక్షంగా తెరస అధినేత కెసిఆర్ గారి విధానాలు కొనసాగుతున్నాయని తెలిపారు. సికింద్రాబాద్ ను అభివృధి పదంలో నడుపుతున్నామని, కార్యకర్తలకు వేనుదన్నుగా నిలుస్తున్నామని తెలిపారు. సభ్యత్వ నమోదు ప్రక్రియను ముమ్మరం చేస్తామని తెలిపారు. తెరాస రాష్ట్ర కార్యదర్శి బక్కి వెంకటయ్య గారు మాట్లాడుతూ ఈ నెల 10వ తేది లోగా సభ్యత్వ నమోదును పూర్తీ చేస్తామని తెలిపారు. తెరస యువ నేతలు తలసాని సాయి కిరణ్ యాదవ్, తీగుల్ల రామేశ్వర్ గౌడ్, కిరణ్ కుమార్ గౌడ్, corporatorl అలకుంట్ సరస్వతి తదితరులు ప్రసంగించిన ఈ కార్యక్రమంలో corporatorlu సామల హేమ, భార్గవి, ధనంజన గౌడ్, విజయకుమారి తదితరులు పాల్గొన్నారు.
Post Views: 278