తెలంగాణ ఏర్ప డ్డాక నేతన్నల బతుకులు మారిపోయాయి. సీఎం కేసీఆర్ రూపొందించిన పథకాలు ఇప్పుడు దేశంలో అన్నిరాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గత రెండేండ్లుగా చేనేతదినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నది. గతంలో నేత కార్మికులు ఉపాధికోసం వలసలు వెళ్లారు. ఈ వృత్తికి మళ్లీ జీవంపోయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. అందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. చేనేత వస్త్రాల విక్రయాలను పెంచడానికి గతంలో పరిశ్రమలు, ఐటీ, చేనేత, జౌళిశాఖ మంత్రిగా వ్యవహరించిన కే తారకరామారావు పెద్ద ఉద్యమాన్నే చేపట్టారు. చేనేతకు తానే బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించా రు. ప్రతి సోమవారం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు, ప్రైవేటు కంపెనీల ఉద్యోగులు చేనేత వస్త్రాలను ధరించే విధంగా పిలుపునిచ్చారు. ప్రభుత్వ రంగ సంస్థలకు అవసరమైన వస్త్రాలన్నింటినీ చేనేత కళాకారులకు ఆర్డర్లు ఇస్తున్నారు. నూలు, రంగు, రసాయనాలపై 50శాతం రాయితీ ఇస్తున్నది. నేతన్నకు చేయూత పథకం ద్వారా ప్రతినెలా ఆదాయంలో 8 శాతం జమచేస్తే.. ప్రభుత్వం 16 శాతం జమచేస్తున్నది. వ్యక్తిగత రుణాలు లక్ష వరకు మాఫీచేశారు. బడ్జెట్‌లోనూ రెండేండ్లుగా రూ.400 కోట్ల చొప్పున చేనేతకు కేటాయిస్తున్నారు.