సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. నాగార్జున్ సాగర్ జలాశయం కుడి కాల్వ నుంచి మంత్రి జగదీశ్ రెడ్డి నీటిని విడుదల చేశారు. సాగర్ ఎడమ కాలువ నుంచి ఏపీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ నీటిని దిగువకు వదిలారు. నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలంలోని అక్కపల్లి ఏఎంఆర్‌పీ ప్రధాన కాలువ ద్వారా తెలంగాణ, ఏపీ మంత్రులు నీటిని విడుదల చేశారు. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. నాగార్జున్ సాగర్ జలాశయం కుడి కాల్వ నుంచి మంత్రి జగదీశ్ రెడ్డి నీటిని విడుదల చేశారు. సాగర్ ఎడమ కాలువ నుంచి ఏపీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ నీటిని దిగువకు వదిలారు. నల్లగొండ జిల్లా పీఏ పల్లి మండలంలోని అక్కపల్లి ఏఎంఆర్‌పీ ప్రధాన కాలువ ద్వారా తెలంగాణ, ఏపీ మంత్రులు నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. అందరికీ ఉపయోగపడేలా సహజ వనరులను వినియోగించుకోవాలని కోరారు. పక్క రాష్ర్టాలతో ఎలా స్నేహంగా ఉండాలో సీఎం కేసీఆర్ ఆచరించి చూపారని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రభుత్వం విజ్ఞతతో వ్యవహరిస్తోందని వివరించారు. కృష్ణా గోదావరిలో నీటిని ఒడిసిపట్టి తెలంగాణలోని బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్నామని జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. ఇరురాష్ర్టాలు స్నేహపూర్వకంగా కలిసి మెలిసి ఉన్నాయని ఏపీ మంత్రి అనిల్ తెలిపారు. సముద్రంలో వృథాగా కలిసే నీటిని సద్వినియోగం చేసుకోవడం సంతోషదాయకమన్నారు.