తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు శనివారం ఉదయం పదకొండు గంటలకు యాదాద్రికి బయలుదేరి వెళ్లారు . కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రికి చేరుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుగా శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి వారిని దర్శించుకోనున్నారు. అనంతరం యాదాద్రి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి యాదాద్రి ఆలయ నిర్మాణం గురించి సంబంధిత అధికారులకు సూచనలు సలహాలు ఇవ్వనున్నారు.
