ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత,మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య కన్నుమూశారు. నిన్న రాత్రి ఆయనకు ఉన్నట్టు ఉండి గుండెపోటు రావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ ఆసుపత్రిలో వైద్యులు ప్రాథమిక చికిత్సనందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఈ రోజు బుధవారం నవ్యాంధ్రలోని వైఎస్సార్ కడప జిల్లాలోని తన నివాసం నుంచి తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఆయన తుదిశ్వాస విడిచారు. అయితే అప్పటి ఉమ్మడి ఏపీలో బ్రహ్మయ్య టీడీపీ తరపున 1994,1999లో రాజంపేట నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారు.
