ప్రస్తుత ఆధునీక టెక్నాలజీ యుగంలో ప్రతి మొబైల్ ఫోన్‌లోని అప్లికేషన్లతో జాగ్రత్తగా ఉండడమనేది మరచిపోకూడని విషయం. మనకు ఫోన్లు చేసే వారి నంబర్లు మన సెల్‌ఫోన్‌లో ఫీడ్ అయి లేకపోయినా… ట్రూ కాలర్ యాప్ సాయంతో కనీసం వారి పేరును తెలుసుకోవచ్చు.
అయితే ఈ యాప్ వల్ల యూజర్ అక్కౌంట్ వివరాలు దుర్వినియోగమయ్యే ప్రమాదముందని తాజాగా వెల్లడైంది. దీంతో ట్రూకాలర్ యాప్ వినియోగదారులు కాస్తంత జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక… రద్దైన, పనిచేయని ఫోన్ నంబర్ల విషయంలో కూడా ట్రూకాలర్ ద్వారా వినియోగదారుల వివరాలను తెలుసుకోవచ్చని సైబర్ నిపుణులు చెబుతున్నారు.
అటాకర్ నంబర్ వెరిఫికేషన్ సిస్టం ద్వారా ట్రూ కాలర్ యూజర్ అక్కౌంట్‌లోనికి లాగిన్ అయితే… అతని వివరాలు హ్యాకర్ల చేతిలోకి వెళ్ళిపోయే ప్రమాదముందని సైబర్ సెక్యూరిటీ సైంటిస్ట్ అహ్మద్ వెల్లడించారు.