రవి చేవెళ్ల “బిత్తిరి సత్తి”గా యావత్ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న సంగతి తెలిసిందే. సత్తి వీ6 ఛానల్లో ‘తీన్మార్’ ప్రోగ్రామ్‌లో తన మాటలతో అందరిని ఆకట్టుకున్నాడు. అతడి హావభావాలు, ప్రవర్తనతో ప్రజల్లోకి చొచ్చుకెళ్లాడు. ఈ క్రమంలోనే వీ6 ఛానెల్ కి బ్రాండ్ ఇమేజ్ .. బిత్తిరిసత్తికి ఫ్యాన్ ఫాలోయింగ్ బీభత్సంగా పెరిగింది. అయితే తాజాగా సత్తి వీ6 ఛానల్ కి గుడ్ బై చెప్పి..టీవీ9లో చేరాడు. ఈ సందర్భంగా టీవీ9లో రజనీకాంత్ వద్ద అపాయింట్మెంట్ లెటర్‌ను తీసుకుంటున్న ఫొటో బయటకు వచ్చింది. కాగా తీన్మార్’ ప్రోగ్రామ్‌లో యాంకర్ సావిత్రక్కగా పనిచేసిన శివజ్యోతి కొన్ని రోజుల క్రితం బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో కంటెస్టెంట్‌గా వెళ్ళిన సంగతి తెలిసిందే.
