తెలంగాణ రాష్ట్రంలో యువశక్తి ఉరకలేస్తోంది. మొత్తం రాష్ట్ర జనాభాలో నాలుగో వంతుకు పైగా యువత ఉంది. 2011లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం అప్పట్లో తెలంగాణ వ్యాప్తంగా 11,16సంవత్సరాల మధ్య వయస్సున్న వారు కోటి మందికిపైగా ఉన్నారు.
ప్రస్తుతం ఈ ఏడాదికి వీరంతా 17-22ఏళ్ల మధ్య వయస్సులో ఉంటారు. అయితే దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రంలో కూడా ఇంతగా యువత లేకపోవడం గమనార్హం. ఈ యువశక్తిని సక్రమంగా వాడుకుంటే వచ్చే పదేళ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో గణనీయమైన పురోగతిని సాధించడం ఖాయం..