ఆ ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే తన నియోజకవర్గం నుండి తిరుమలకు పాదయత్రగా గా వస్తానని మొక్కుకున్నారు.. ఇప్పుడు ఆ మొక్కును చెల్లించుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో అఖండ మెజారీటీతో వైసీపీ ఏకంగా 151 సీట్లతో గెలిచింది. అసెంబ్లీ ఎన్నికలలో నియోజకవర్గ, జిల్లాస్థాయిలో రికార్డులు బద్దలుగొట్టింది. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే కూడా మొత్తం 82వేల పైచిలుకు ఓట్ల మెజారిటితో రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి తర్వాత రెండవ స్తానంలో నిలిచి ప్రజలందరి చేత అన్నా అనిపించుకున్నారు.. కొద్దిగా ఆలస్యంగా ఆరుపదుల వయస్సు దాటిన అనుకున్న మాటకోసం పాదయత్ర మొదలు పెట్టారు ఆయనే ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబు.. తాజాగా అర్ధవీడు మండలం కాకర్ల గ్రామంలోని వెంకటేశ్వరస్వామి గుడిలో ప్రత్యేకపూజలు నిర్వహించిన ఆయన పాదయాత్రను ప్రారంభించారు. అన్నా రాంబాబు పాదయాత్రతో నియోజకవర్గం మొత్తం పండగ వాతావరణం నెలకొంది. గ్రామంలో ఎటుచూసినా కోలాహలంతో అన్నా రాంబాబుకు బ్రహ్మరధం పట్టారు. గిద్దలూరు నియోజకవర్గంలోని పలువురు నాయకులు ,కార్యకర్తలు ఎమ్మెల్యే అన్నకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
