టాలీవుడ్ దర్శకుడు రవిబాబుపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఇండస్ట్రీ షాక్ అయ్యింది. రవిబాబు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి శిరీషా ఆరోపణలు చేయడం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. శిరీషా 50 సినిమాలకుపైగానే నటించింది. క్యారెక్టర్ ఆర్టిస్టు, ఐటమ్ గర్ల్‌గా ఆమె అదరగొట్టింది. ఇంకా రవిబాబు దర్శకత్వంలో నువ్విలా సినిమాలో నటించింది. కానీ ప్రస్తుతం అవకాశాలు రాకపోవడంతో తనపై రవిబాబు బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయింది. దర్శకులు నిర్మాతల పక్కల్లోకి మేం వెళ్లాలని.. కానీ సినిమా ఛాన్సులు మాత్రం ఇతర ఇండస్ట్రీ వాళ్లకు ఇస్తున్నారని శిరీషా సంచలన కామెంట్స్ చేసింది. అంతేగాకుండా అతడు తనతో అభ్యంతరకరంగా ప్రవర్తించడమే కాకుండా నీ రేటు ఎంత? అని బూతులు మాట్లాడేవాడని శిరీష ఆరోపించింది. అతడి పక్కలోకి వెళ్లలేదని బతుకు లేకుండా చేస్తున్నాడని తెలిపింది. అతడి గురించి ఎవరికి చెప్పినా ప్రయోజనం లేదని తెలిపింది. రెండు సంవత్సరాల నుంచి తనను తీవ్రంగా వేధిస్తున్నాడని, తాను అవకాశాలివ్వకపోవడంతో పాటు ఇతరులు ఛాన్సులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడని ఫైర్ అయ్యింది.