హైదరాబాద్ లో సీజనల్ వ్యాధులపై సమీక్ష నిర్వహించారు మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్. జీహెచ్ఎంసీ ప్రధానకార్యాలయంలో సుదీర్ఘంగా జరిగిన సమీక్షలో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు. నగరంలో జ్వరాల తీవ్రత, తీసుకుంటున్న నివారణ చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమీక్షలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో సీజనల్ వ్యాధుల నివారణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి కేటీఆర్. సీజనల్ వ్యాదుల నివారణ కోసం క్యాలెండర్ ను రూపొందించాలని అధికారులను ఆదేశించామన్నారు. వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. స్కూళ్లు, బస్తీలు, అపార్ట్ మెంట్లలో సదస్సులు ఏర్పాటు చేయబోతున్నామన్నారు.
జ్వరాలన్నీ డెంగీ జ్వరాలు కాదన్నారు మంత్రి కేటీఆర్. నీరు నిల్వ ఉండటం వల్లే డెంగీ దోమలు విజృంభిస్తున్నాయన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో డెంగీ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు తెలిపారు. అలాంటి ప్రాంతాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తామన్నారు. డెంగీపై విపక్షాలు అనవసరరాద్ధాంతం చేస్తున్నాయన్నారు. బస్తీ దావఖానాల్లో సాయంత్రం ఓపీ ప్రారంభించామన్నారు మంత్రి కేటీఆర్. వీటి సంఖ్యను పెంచే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. నిర్మాణ వ్యర్దాలను రోడ్లపై వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఆదేశించామన్నారు. వర్షం వల్ల దెబ్బతిన్న రోడ్లను వెంటనే పునరుద్ధరిస్తామన్నారు. ప్రజల కోరిక ప్రకారం శానిటేషన్ విషయంలో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తామన్నారు. జ్వరాల నియంత్రణకు ప్రజల సహకారం అవసరమన్నారు కేటీఆర్. సరైన పారిశుద్యం పాటిస్తే చాలా సమస్యలు దూరమవుతాయన్నారు.
Had a discussion on priorities of the Department with principal secretary MA&UD @arvindkumar_ias and heads of departments; GHMC commissioner, HMWSSB MD, CDMA, DTCP & ENC public health
Sanitation, urban planning and improving infrastructure are key agenda pic.twitter.com/eY6mt1VJfh
— KTR (@KTRTRS) September 9, 2019