తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా ప్రమాణ స్వీకారం చేసిన తమిళ సై సౌందర రాజన్ రాష్ట్ర ప్రజలను ఉద్ధేశించి సందేశమిచ్చారు. ప్రముఖ టెలివిజన్ దూరదర్శన్ లో గవర్నర్ తమిళసై మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ సర్కారు పాలన బాగుంది.
ప్రజాసంక్షేమం కోసం ప్రవేశ పెడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలు బాగున్నాయి. అభివృద్ధి పథంలో తెలంగాణ దూసుకుపోతూ దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది. రైతాంగం కోసం సర్కారు తీసుకొచ్చిన రైతుబీమా,రైతుబంధు పథకాలు పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి.
తెలంగాణకు వరప్రదాయిని అయిన కాళేశ్వరం మానవ నిర్మిత అద్భుతం. కాళేశ్వరం ద్వారా రైతాంగానికి సాగునీళ్లివ్వడం గొప్ప విషయం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని సమర్ధవంతమైన నాయకులతో కల్సి నేను భాగస్వామ్యం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. రండి అందరం కలిసి బంగారు తెలంగాణను నిర్మిద్దాం.. జై హింద్ .. జై తెలంగాణ అని ఆమె పిలుపునిచ్చారు.