బాలీవుడ్ భాయిజాన్ సల్మాన్ ఖాన్ మరోసారి చుల్ బుల్ పాండే పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరిని అలరించనున్నాడు. దబాంగ్ సిరీస్ లో భాగంగా మరోసారి దబాంగ్-3 తో పోలీస్ ఆఫీసర్ గా రానున్నాడు.ఈ మేరకు సినిమాకు సంబంధించి ఫస్ట్ మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయడం జరిగింది. సల్మాన్ ఖాన్ ఇంస్టాగ్రామ్ ద్వారా పోస్టర్ ని షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ బాగా వైరల్ అవుతుంది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఈ చిత్రం 100 రోజులు పక్కా అని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉన్నారు.