తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి వర్యులుగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత తొలి క్యాబినేట్ లో బెర్త్ దక్కకపోయిన కానీ ఈ నెలలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో తన్నీరు హారీశ్ రావు ఆర్థిక శాఖ మంత్రిగా బెర్త్ ను కన్ఫామ్ చేసుకున్నారు.
అయితే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన హరీశ్ రావుకు అభినందనలు చెప్పడానికి మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ,పార్టీ నేతలు,కార్యకర్తలు,అభిమానులు పూలబోకేలతో.. శాలువాలతో వస్తోన్నారు.
వీర్ని దృష్టిలో పెట్టుకుని మంత్రి హారీష్ రావు”నన్ను కలవడానికి వచ్చేవాళ్లు బోకేలు.. శాలువలు తీసుకురావద్దు. వాటి బదులు నోటు పుస్తకాలు..చేనేత కార్మికులు తయారు చేసిన రుమాళ్లు తీసుకురండి. వాటిని విద్యార్థులకు ఇద్దామని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి హారీశ్ రావు తీసుకున్న నిర్ణయం పట్ల నెటిజన్లు,ఆయన అభిమానులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.