పశ్చిమ బెంగాల్ సీఎం,టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. కలకత్తా నగర మాజీ పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ అరెస్టు నుంచి రక్షణ కల్పించే స్టేను ఆ రాష్ట్ర హైకోర్టు ఎత్తివేసింది. అంతేకాకుండా రాజీవ్ కుమార్ అరెస్టుపై సీబీఐ నిర్ణయం తీసుకోవాలని కూడా ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో పెనుసంచలనం సృష్టించిన శారద చిట్ ఫండ్ కుంభకోణంపై సిట్ కు సారధ్యం వహించిన రాజీవ్ కుమార్ ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను మాయం చేశారని సీబీఐ ప్రధాన ఆరోపణ.
