తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అసెంబ్లీ సాక్షిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ దిగిపోతాడంట.
మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేస్తాడంట. అని బయట ప్రచారం జరుగుతుంది. నేనేందుకు దిగిపోతాను. నాకేమి బాగానే ఉన్నాను కదా.. నాకు ఆరోగ్యం బాగానే ఉంది కదా.. కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా ఎందుకు చేస్తానని” ఆయన ప్రశ్నించారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ మేము ప్రజల కోసం మంచి పనులు చేస్తున్నాం.. ప్రజల మంచి కోసమే ఆరాట పడుతున్నాం. మరో మూడు టర్మ్ లు మేమే అధికారంలో ఉంటాం. ఇప్పుడు నాకు అరవై ఆరేళ్లు. మరో పదేళ్లు సీఎంగా చేయలేనా.. నేనే ముఖ్యమంత్రిగా ఉంటానని”ఆయన తేల్చి చెప్పారు.