హీరోయిన్లు ఎంత అందంగా ఉన్నా.. ఎన్ని హిట్లు పడ్డా వారి కెరియర్ మాత్రం ప్రస్తుత కాలంలో నీటి బుడగలాగే తయారైంది. కనిపించినన్ని రోజులు కనిపించి ఆ తరువాత కనుమరుగై పోతున్నారు. కానీ కొంత మంది మాత్రం ఏజ్ ఎంత పెరిగినా..గ్లామర్ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా ఇంకా లీడ్ హీరోయిన్లుగా చెలామణి అవుతున్నారు. అందులో నయనతార ఒకరు.
నయనాతార సినిమాల పరంగా ఎన్నో హిట్లు సొంతం చేసుకున్నా… లవ్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఫెయిల్యూర్ లవ్ స్టోరీలను సొంత చేసుకుంది. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ విఘ్నేష్ తో ప్రేమలో ఉంది. త్వరలో పెళ్లి చేసుకుంటారని టాక్. అయితే ప్రస్తుతం విఘ్నేష్ పెట్టిన ఓ ఫోటో తెగ వైరల్ గా మారింది. నయనతార ఫోటో దిగడానికి ఇష్టపడటం లేదు. తలదాచుకుంది. కానీ తన లవర్ మాత్రం ఫోటో తీసేశాడు.అక్కడితో ఆగలేదు..ఏకంగా సోషల్ మీడియాలో పెట్టాడు. త్వరలో ఇద్దరు కలిసి నటించిన సినిమా వస్తుందని, క్యారెక్టర్స్ వేరని చెప్పాడు విఘ్నేష్ మరి ఆ విశేషాలు ఏంటో తెలిసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.