టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ,చిరు తనయుడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వస్తోన్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి . అయితే తండ్రి తనయులకు బిగ్ షాక్ తగిలింది . సైరా నరసింహ రెడ్డి మూవీ ప్రముఖ ఫ్రీడమ్ ఫైటర్ ఉయ్యాలవాడ నర్సింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న నేపథ్యంలో ఈ చిత్రం గురించి కొన్ని ఆధారాలను ,సంఘటనలను తమ దగ్గర తీసుకొని డబ్బులు ఇస్తామని చెప్పి మోసం చేశారు అని నరసింహ రెడ్డి కుటుంబ సభ్యులు హైదరాబాద్ మహానగరంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. అయితే ఈ మధ్య కొత్త సినిమాలు విడుదలకు ముందు ఆ చిత్రంపై కావచ్చు .. హీరో పైనో .. దర్శకనిర్మాతలపై కేసులు పెట్టడం సర్వసాధారణమైన సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం .
