మంచు అనేది పేరుకు చల్లగా ఉన్నా…ఈ ఇంట్లో వాళ్లు మత్రం గరం గరంగా ఉంటారు బయట. పద్దతికి, డిసిప్లేన్ కి కేరాఫ్ అడ్రస్ గా మోహన్ బాబు, ఫైర్ బ్రాండ్ గా మంచు లక్ష్మీ ఉంటారు. మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా…తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుని టాలీవుడ్ ని ఏలుతుంది. మంచు లక్ష్మీ అంటే నిజానికి అందరికి భయమే…ముక్కుసూటిగా మాట్లాడే తత్వం..కమాండ్ చేసే తెగింపు ఉండటంతో మంచు లక్ష్మి టాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా తయారైంది.
అయితే ఇదే దారిలో తన కూతుర్ని కూడా నడిపిస్తుంది లక్ష్మి. తను యాక్ట్ చేస్తున్న ఓ సీన్ కి తన కూతురు యాక్షన్ చెప్పింది. చాలా గంభీరంగా సెటిల్డ్ గా చెప్పింది. దీంతో మురిసిపోయిన లక్ష్మి తను నా కూతురు అంటూ… వీడియో పెట్టింది. అచ్చం నాలాగా ప్రవర్తిస్తుంది అంటూ వీడియో ఫోస్ట్ చేసింది.